Studio18 News - తెలంగాణ / : Mallu Bhatti Vikramarka : స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి మా క్యాబినెట్ కు ఇంతకన్నా తృప్తినిచ్చే కార్యక్రమం మరొకటి లేదన్నారాయన. యువతకు ఎలాంటి ఉపాధి కల్పించాలి అనే ఆలోచన నుండి వచ్చిందే స్కిల్ యూనివర్సిటీ అని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో అలా జరగలేదన్నారు. యువత నిరాశ నిస్పృహల్లోకి వెళ్లింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక మాకు మంచి జరుగుతుందని యువత నమ్మింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ”కొన్ని లక్షల మంది యువతీ యువకుల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. పారిశ్రామిక అవసరం కోసం యువతను తయారు చేసేది ఈ యూనివర్సిటీ. పారిశ్రామిక వేత్తలను పోగేసి మా వద్ద యువత ఉంది వారికి స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేందుకు ఏర్పాటు చేశాం. హెల్త్ సిటీ, లైఫ్ సైన్స్, AI లాంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ భూమి ఉంటే చాలు బతకవచ్చు అనేలా సిటీ నిర్మాణం చేస్తాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కంటే మెరుగైన సిటీ నిర్మాణం చేస్తాం. ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన వారికి ప్లాంట్స్ ఇచ్చి వదిలేయడం కాదు. వారికి అద్భుతంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రజా ప్రభుత్వం మా కోసం పని చేస్తుందని ప్రజలు అనుకునే ఈరోజు. 2 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రయత్నాలు- మంత్రి శ్రీధర్ బాబు ‘ఒక కొత్త ఆలోచన, కొత్త నగరం, కొత్త గమ్యం ఇక్కడ మొదలు కావాలని ఆలోచన చేసిన సీఎంకు ధన్యవాదాలు. మార్పు తీసుకొస్తామన్న హామీ మీదగా కొత్త యూనివర్సిటీ తీసుకొస్తున్నాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం చేస్కోని ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దని మా సీఎం, మా క్యాబినెట్ నిర్ణయం మేరకు ఇక్కడ ఉపాధి కల్పన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ నెట్ జీరో సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అంటే కాలుష్య రహిత ప్రాంతంగా అన్ని వసతులు కలిపిస్తాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటతో ఉపాధి కల్పన జరుగుతుంది. TGPSC ద్వారా 2 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రయత్నాలు. 2లక్షల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, మిగతా వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నాం. భూములు పోయి ఇబ్బందులు పడకుండా నార్కో ఆధ్వర్యంలో మోడ్రన్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ మోడ్రన్ స్కూల్ లో ఉచితంగా విద్యను కార్పోరేట్ స్థాయి అందిస్తారు. నైపుణ్యం పెంచే యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాము. పారిశ్రామిక వేత్తలు వారికి కావాల్సిన రంగంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం ఇది. చాలామంది వ్యవసాయ భూములు పోయాయి. వారి త్యాగం వృధా అవ్వదు. ఇక్కడ కొత్త సిటీ ఏర్పాటు చేసే క్రమంలో స్ధానిక ప్రజల సాయం కావాలి. ఇక్కడ భూములు కోల్పోయిన వారికి న్యాయపరంగా ఉన్న అన్ని డిమాండ్స్ నెరవేరుస్తాము”.
Admin
Studio18 News