Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల కూల్చివేతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. హైడ్రా పేరుతో ఈ కూల్చివేతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఆదివారం మాదాపూర్ లోని సున్నంచెరువులోని అక్రమ కట్టడాల కూల్చివేతను హైడ్రా చేపట్టింది. అయితే, ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. పలువురు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, తమ విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై హైడ్రా సిబ్బంది మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకటేశ్, లక్ష్మి, సురేశ్ అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
Studio18 News