Studio18 News - తెలంగాణ / : ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 690 అడుగులకు చేరుకుంది. ఇప్పుడు మూడు గేట్ల నుంచి వరద నీరు భారీగా లీక్ అవుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు గేట్లకు ఇటీవల ప్రభుత్వం రూ. 9 కోట్లతో మరమ్మతులు చేయించింది. అయినప్పటికీ ప్రస్తుతం 13, 14, 15 గేట్ల నుంచి వరద నీరు భారీగా లీక్ అవుతూ వృథాగా పోతోంది. మరమ్మతులు చేపట్టి నెల రోజులు కూడా కాకముందే పరిస్థితి మళ్లీ మొదటికి రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం చెత్త పేరుకుపోవడం వల్లే వరద నీరు లీక్ అవుతోందని చెబుతున్నారు.
Admin
Studio18 News