Sunday, 25 January 2026 05:10:41 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు..

Date : 27 August 2024 02:36 PM Views : 576

Studio18 News - TELANGANA / : Kavitha bail plea: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్‌ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి. దర్యాప్తునకు కవిత సహరించడం లేదని, ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయా అని సుప్రీంకోర్టు ధర్మాసనంగా ప్రశ్నించగా.. నిందితులతో కవిత జరిపిన చాటింగ్ వివరాలున్నాయని ఈడీ సమాధానం ఇచ్చింది. వ్యక్తిగత హోదా అనేది బెయిల్ ఇవ్వడానికి ఆధారం కాదని ఈడీ వాదించింది. కవితకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ముకుల్ రోహత్గి అభ్యర్థించారు. విచారణకు ఆమె సహకరించారని, ఫోన్లు కూడా ఈడీకి స్వాధీనం చేశారని చెప్పారు. బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో 5 నెలలు, సీబీఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో రూ. 100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమేనని అన్నారు. సిసోడియాకు బెయిల్ ఇచ్చారు.. మహిళగా బెయిల్‌కు అర్హురాలని పేర్కొన్నారు. కాగా, కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపధ్యంలో ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, హరీశ్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :