Studio18 News - తెలంగాణ / : Paidi Rakesh Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కలిశారు. తన నియోజకవర్గంలో కొంత మంది పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ప్రజల కోసం ధైర్యంగా పనిచేసే నిజాయితీ గల పోలీస్ అధికారులను నియమించాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన వినతి పత్రం అందేశారు. రాకేశ్ రెడ్డి వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కాగా, అంతకుముందు అసెంబ్లీలో రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌కి ఎలాగైతే నిధులు కేటాయిస్తున్నారో, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్‌బాబు కామెంట్స్ అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఆవేశపడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడడంతో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ రోజు అసెంబ్లీ చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎవరి పేరును తీసుకోలేదు. బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. టోటల్ హైదరాబాద్ అభివృద్ధి కోసం 1లక్ష 50వేల కోట్లు అని సీఎం అన్నారు. మొత్తం హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు చేసే నిధులను మూసీకి అపాదిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో తనకు జరిగిన అవమానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటిసారి గళం విప్పారు. పదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారని అన్నారు. భట్టి విక్రమార్క చాలా బాధపడ్డారు: ఆది శ్రీనివాస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనసులో నుంచి ఇవాళ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. పదేళ్ల బాధను ఇవాళ బయట పెట్టుకున్నారు. మొదటిసారి దళితుడు అనే పదం భట్టి నుంచి వచ్చింది. దళితుడు అనే పదాన్ని ఆయన ఎప్పుడూ వాడరు. భట్టి చాలా బాధపడ్డారు కాబట్టే తన ఆవేదనను ఇవాళ బయటపెట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ ఆఫీసులో రైతు హెల్ప్ లైన్ సెంటర్ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో రైతు హెల్ప్ లైన్ సెంటర్‌ను హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. రుణమాఫీ, రైతు భరోసా సంబంధించిన సమస్యలపై 8886100097 నంబరుకు రైతులు కాల్ చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
Admin
Studio18 News