Studio18 News - తెలంగాణ / : HMDA Website: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలను చెరబట్టిన అక్రమార్కుల భరతం పడుతోంది హైడ్రా. ఎఫ్టీఎఫ్ పరిధిలో నిర్మించిన కట్టడాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్ప్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కూల్చివేస్తోంది. ఇప్పటికే వందలాది అక్రమ నిర్మాణాలను నేటమట్టం చేసింది. ఇంకా చాలా వాటికి నోటీసులు ఇచ్చింది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైడ్రాకు దన్నుగా నిలిచారు. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించిన వారు ఎంతటివారైనా వదిలేదని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సేవలకు బుధవారం అంతరాయం కలిగింది. సర్వర్ డౌన్ కావడంతో హెచ్ఎండీఏ వెబ్‌సైట్ నిలిచిపోయింది. దీంతో హెచ్ఎండీఏ ద్వారా జరిగే అన్నిరకాల ఆన్‌లైన్ సేవలు ఆగిపోయాయి. రేపటి వరకు వేచిచూడక తప్పదని అధికారులు చెప్పారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగర పౌరులు ఆన్‌లైన్ సేవలను హెచ్ఎండీఏ వెబ్‌సైట్ ద్వారా సాగిస్తున్నారు. కాగా, హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో హెచ్ఎండీఏ వెబ్‌సైట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చెరువుల కబ్జాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో చెరువులకు సంబంధించిన డేటా కనిపించడం లేదు. దీంతో హెచ్ఎండీఏ వెబ్‌సైట్ సేవలు నిలిచిపోడంపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Admin
Studio18 News