Studio18 News - తెలంగాణ / : గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ఫుడ్‌ఫెస్టివల్ పలువురు ప్రముఖుల కలయికకు వేదికైంది. ఆద్యంతం సందడిగా, సరదాగా, హుషారుగా సాగిన ఈ వేడుకలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల, సీనియర్ నటుడు తణికెళ్ల భరణి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ సందడి చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి కలిసి ప్రారంభించిన ఈ ఫుడ్ ఫెస్టివల్‌ను సుమ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఓ వైపు సన్నని వర్షం.. మరోవైపు సుమ సందడితో ఫెస్టివల్ ఆహ్లాదంగా మారింది. ఆ తర్వాత జ్యూస్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తణికెళ్ల తన చమత్కారాలతో ఆహూతులను అలరించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమకు ఆయన పరమ శివుడి మంగళమయ జ్ఞాపిక అందించారు. తణికెళ్ల భరణిని నిర్వాహకులు ఈశ్వరుడి జ్ఞాపికతో సత్కరించారు. ఎంతో ఒత్తిడితో కూడిన దైనందిన జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఆహూతులు సంతోషం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News