Studio18 News - తెలంగాణ / : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు 16మంది కౌన్సిలర్ లతో నెగ్గి పురపాలక చైర్మన్ పదవి చేజెక్కించున్న కాంగ్రెస్... మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గార్లపాటి శ్రీనివాసులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ మాధవి ఈ ఎన్నికను నిర్వహించారు. 14 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ తన ఓటు హక్కును వినియోగించడంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 15 కు చేరింది. కాగా నలుగురు బిఆర్ఎస్ సభ్యులు కౌన్సిల్ సమావేశానికి గైరైజర్ అయ్యారు. చైర్మన్గా ఎన్నికైన శ్రీనివాసను ఆర్డీవో మాధవి చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని నూతనంగా ఎన్నికైన అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ గార్ల పాటి శ్రీనివాసులు ,వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డిలను అభినందించారు.
Also Read : chittoor : పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం :
Admin
Studio18 News