Tuesday, 03 December 2024 05:14:25 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Naga Chaitanya: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై ప్రశ్నించగా నాగచైతన్య సమాధానం ఇదే

Date : 28 August 2024 12:05 PM Views : 79

Studio18 News - తెలంగాణ / : తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మించారంటూ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు ఇటీవల నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతపై ప్రముఖ సినీ నటుడు నాగార్జున కొడుకు, హీరో నాగ చైతన్య స్పందించాడు. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు సంబంధించి నాన్న ‘ఎక్స్‌’ వేదికగా అన్ని వివరాలు చెప్పారని అన్నారు. ఈ విషయం ఇప్పుడు మాట్లాడొద్దని అన్నారు. హిమాయత్‌నగర్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా నాగ చైతన్య వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. తన పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు. ‘హైదరాబాద్‌లోనే మీ పెళ్లి జరుగుతుందా? అని ప్రశ్నించగా ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. నటి శోభితా ధూళిపాళ, నాగచైతన్యకు ఈ నెల 8న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తండేల్ సినిమాపై కూడా ఆయన స్పందించారు. తండేల్‌లో తన పాత్ర అత్యంత సవాల్‌తో కూడుకున్నదని, ఇది యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. తన ప్రస్తుత లుక్‌ తండేల్‌ సినిమా కోసమేనని వెల్లడించారు. కాగా ఈ సినిమా చందూ మొండేటి డైరెక్షన్‌లో రూపొందుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :