Saturday, 14 December 2024 04:12:42 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

K. V. Ramana Reddy: అనవసరంగా గెలిచా.. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి ఆవేదన

Date : 25 July 2024 02:19 PM Views : 81

Studio18 News - తెలంగాణ / : తాను ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని బాధగా అనిపిస్తోందంటూ కామారెడ్డి బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. లోపల ఒకరినొకరు తిట్టుకుని బయట మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన తనకు సభలో ఎలా వ్యవహరించాలో తెలుసని చెప్పారు. గతంలో అసెంబ్లీ మీదుగా వెళ్లేటప్పుడు ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వెళ్తానా అని అనుకునే వాడినని, ప్రజలకు ఎమ్మెల్యేలు మంచి చేస్తారని భావించేవాడినని గుర్తుచేసుకున్నారు. కానీ, కొందరు జీతాలు తీసుకుని కూడా అసెంబ్లీకి రావడం లేదని, మరికొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నాయకులు మాట్లాడితే మిగతా 60 మంది వారికి భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నాయకులే లేరని, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలన్న ఆలోచన కూడా వారికి ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఘోష నేతలకు వినపడడం లేదన్నారు. అంతమాత్రాన తానేం సత్యహరిశ్చంద్రుడిని కాదని చెప్పుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :