Studio18 News - తెలంగాణ / : సౌత్ గ్లాస్ ప్రైవేట్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ప్రమాదం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మృతి చెందినవారిలో ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులు ఉన్నారు.
Admin
Studio18 News