Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో వారు స్పీకర్‌ను కలిశారు. కౌశిక్ రెడ్డి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు... మహిళలను కించపరచడం మానుకోవాలని హెచ్చరించారు.
Admin
Studio18 News