Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని అబిడ్స్ కట్టెలమండిలో అపహరణకు గురైన ఒకటో తరగతి బాలికను పోలీసులు రక్షించి తీసుకొచ్చారు. కిడ్నాపర్ బిలాల్ బీహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలిపారు. నిన్న సాయంత్రం 5.30 గంటలకు పాప కిడ్నాప్ అయినట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, వెంటనే కేసు నమోదు చేశామని డీసీపీ అన్నారు. అరు టీంలను ఫార్మ్ చేశామని, పాప మిస్ అయిన ప్రాంతం నుంచి సీసీటీవీలను వెరిఫై చేశామని తెలిపారు. ఒక సీసీటీవీలో నాంపల్లిలో కిడ్నాపర్ పాపను ఆటో తీసుకు వెళ్తున్నట్టు గుర్తించామని చెప్పారు. అతడు అఫ్జల్‌గంజ్ బస్టాప్‌లో దిగాడని, అక్కడి నుంచి కొత్తూరు మండలంలో తాను ఉంటున్న ఇనుమినాల్ లేబర్ క్యాంపుకు వెళ్లాడని తెలిపారు. అతడికి బిహార్‌లో నేరచరిత్ర ఇనుమినాల్ లేబర్ క్యాంప్లో పాపతోపాటు నిందితుడని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితుడు బిహార్ కు చెందిన మహమ్మద్ బిలాల్ గా గుర్తించామని చెప్పారు. అతడికి బిహార్ లో నేర చరిత్ర ఉందని తెలిపారు. దొంగతనం కేసుతో పాటు పోక్సో కేసులో మహమ్మద్ బిలాల్ అరెస్ట్ అయ్యాడని చెప్పారు. రెండు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడని అన్నారు. మార్చి నెలలో జైలు నుంచి విడుదలైన బిలాల్ నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్మాణ పనుల్లో ఉపాధి కోసం బిలాల్ వచ్చాడని అన్నారు. పాపకు సైకిల్ కొనిస్తాను అని చెప్పి తీసుకువెళ్లాడని తెలిపారు. పాప తండ్రి నుంచి డబ్బులు రాబట్టే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. మహమ్మద్ బిలాల్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్ లో మొబైల్ చోరీ కేసు ఉందని తెలిపారు. పాపను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపించామని, వచ్చే రిపోర్ట్ సాధారణంగా నిందితుడుపై పోక్సో నమోదు చేస్తామని అన్నారు.
Admin
Studio18 News