Tuesday, 03 December 2024 04:10:08 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

సుప్రీంకోర్టు 4 రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు చేయాలి: కేంద్రానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అప్పీల్

Date : 07 August 2024 04:36 PM Views : 39

Studio18 News - తెలంగాణ / : BRS party legal cell: న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు సుప్రీంకోర్టు నాలుగు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ కోరింది. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధాన కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ మూడు పిల్లర్లు. 18వ లా కమీషన్ సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా రీజినల్ బెంచులు ఏర్పాటు చేయాలని చెప్పింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా ముంబై, కలకత్తా, హైదరాబాద్ లేదా చెన్నైలో ఏర్పాటు చేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు అంశం కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంటులో చెప్పారు. దేశ సమగ్రతకు విఘాతమని బ్రెంచ్‌లు ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఒప్పుకోవడం లేదని కేంద్ర మంత్రి చెప్పారు. నేను గతంలో పార్లమెంటులో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టాను. సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసే అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బదులు రాష్ట్రపతి అని పేర్కొనాలని నా బిల్లులో పేర్కొన్నాను. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 4 కోట్ల కేసులు జిల్లా కోర్టుల్లో ఉన్నాయి. 2 లక్షల కేసులు 30 సంవత్సరాలుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 90 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు బెంచ్‌లు ఉండాలని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా చెప్పారు. జనాభాకు అనుగుణంగా జడ్జీల సంఖ్య లేకపోవడంతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. న్యాయమూర్తులపై ఒత్తిడి పెరిగితే జడ్జిమెంట్ల యొక్క క్వాలిటీ దెబ్బ తింటుంది. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఎందుకు ఉండాలి ఎక్కువ మంది వుంటే ఏమవుతుంది? రాష్ట్రవిభజన జరిగినప్పుడు ఏపీకి 37, తెలంగాణకు 24 మంది జడ్జీలను మాత్రమే కేటాయించారు. మేము అధికారంలోకి వచ్చాక తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచుకున్నాం. కేసులు త్వరగా పరిష్కారమైతే న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :