Saturday, 14 December 2024 03:18:53 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Uttam Kumar Reddy: టీడీపీ, జేడీయూ పార్టీలను సంతృప్తి పరిచేందుకు తీసుకువచ్చిన బడ్జెట్ లా ఉంది: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు

Date : 23 July 2024 05:31 PM Views : 55

Studio18 News - తెలంగాణ / : బడ్జెట్ లో ఏపీకి భారీగా కేటాయింపులు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించడాన్ని తామేమీ తప్పుబట్టడంలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు హామీ ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రుల బృందం గత ఏడు మాసాలుగా నిధులు కేటాయించాలని కోరుతూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 'బీహార్ కు రూ.41 వేల కోట్లు, ఏపీకి రూ.15 వేల కోట్లు ప్రకటించారు, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు అందిస్తామన్నారు... కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను మాత్రం పూర్తిగా విస్మరించారు' అంటూ ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు. దీన్నిబట్టి చూస్తే, ఇది ప్రజల బడ్జెట్ కాదని, రాజకీయ ఉద్దేశాలతో కూడిన బడ్జెట్ అని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. జేడీయూ, టీడీపీలను సంతృప్తి పరిచేందుకు తీసుకువచ్చిన బడ్జెట్ లా ఉందని విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :