Friday, 14 February 2025 08:16:28 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రతిపాదనల సవరింపు.. కోకాపేట వరకూ మెట్రో నిర్మాణం

Date : 26 July 2024 10:58 AM Views : 98

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మునుపటి ప్రతిపాదనల్లో భాగంగా 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజా సవరింపుతో అది 78.4 కిలోమీటర్లకు చేరుకుంది. అంచనా వ్యయం కూడా పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. ఈ మార్గాల్లోనే కొత్త ట్రాక్ నిర్మాణం.. మునుపటి ప్రతిపాదనల ప్రకారం, రాయదుర్గం నుంచి విప్రో కూడలి, యూఎస్ కాన్సులేట్ వరకూ 8 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టాలి. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్ వరకూ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా 3.3 కిలోమీటర్ల మేర అదనంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇక అక్కడే మెట్రో డిపో ఏర్పాటు కోసం అధికారులు భూముల పరిశీలన చేశారు. నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి కూడలి నుంచి జల్‌పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకూ మొదట్లో 29 కిలోమీటర్ల మేర ఎయిర్‌‌పోర్టు మెట్రోను ప్లాన్ చేశారు. తాజా సవరింపుతో ఇది 4 కిలోమీటర్ల మేర పెరిగింది. ఈ కారిడార్‌లో మైలార్ దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు వరకూ 5 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇక ఎల్బీనగర్ - హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట కారిడార్లలో మాత్రం మార్పులు చేర్పులు చేయలేదు. అయితే, నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలను మెట్రో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని మంత్రి భట్టి అసెంబ్లీలో పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :