Monday, 17 February 2025 05:04:03 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Revanth Reddy: సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 15 August 2024 04:46 PM Views : 64

Studio18 News - TELANGANA / : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మొదటి పంప్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా, మూడో పంప్ హౌస్‌ను ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రారంభించారు. నా కల నెరవేరింది: తుమ్మల సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో తన రాజకీయ కల నెరవేరిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పంప్ హౌజ్ మోటర్లు పాడవకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బిజీ షెడ్యూల్‌లోను ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం వచ్చారన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి రాములవారి పాదాల వద్ద ప్రకటన చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఇవాళ సగర్వంగా వైరా సభ నిర్వహిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ నీళ్ళు రాని పక్షంలో గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ సమయంలో 70 రోజుల్లో వైరా లింక్ కెనాల్ పూర్తి చేశామన్నారు. తమ ప్రభుత్వం నీరు అందించి సాగుకు దన్నుగా నిలుస్తోందన్నారు. అలాగే రుణమాఫీ చేసి రైతన్నల పక్షమని నిరూపించుకున్నామన్నారు. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :