Studio18 News - తెలంగాణ / : Thummala Nageswara Rao : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ప్రచారంకోసం బటన్ నొక్కే వ్యక్తిని నేను కాదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పిలుపుతో నేను రాజకీయాల్లోకి వచ్చానని, ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా కొనసాగానని చెప్పారు. శ్రీరామ చంద్రుడి దయవల్ల, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో అనేక దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అయితే, ఖమ్మం జిల్లా నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న గోదావరి నది నుంచి మన భూభాగానికి నీళ్లు తెచ్చుకోలేక పోయామని చెప్పారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనేది నా సంకల్పం అని చెప్పారు. తాను ప్లెక్సీలకోసం క్రెడిట్ కోసం ఏనాడూ ఆరాటపడలేదన్న తుమ్మల.. జిల్లా ప్రజలకు సేవచేస్తున్న తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదంటూ మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం అన్నారు.
Admin
Studio18 News