Studio18 News - తెలంగాణ / : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలపై మంద కృష్ణమాదిగ స్పందించారు. శాసన సభ్యులు ఇద్దరూ వీధి రౌడీలలా రొడ్డెక్కడం హేయమైన చర్య అని మండిపడ్డారు. వారిద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే ఇటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగ అన్నారు. పరస్పర దాడులు చేసుకుంటూ రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన, వ్యాఖ్యలను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ప్రవర్తన వీధిరౌడీలను మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. వారు చేసిన వ్యాఖ్యలు మహిళలను కించ పరిచే విధంగా ఉన్నాయని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని, మధ్యలో కార్యకర్తలు బలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. వీళ్లు వ్యక్తిగత దూషణలతో ప్రజలకు ఏం చెప్పదలుచు కున్నారని మంద కృష్ణమాదిగ నిలదీశారు.
Admin
Studio18 News