Friday, 14 February 2025 07:40:30 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Komatireddy Venkat Reddy: నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి: మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

Date : 04 August 2024 11:52 AM Views : 100

Studio18 News - TELANGANA / : అమెరికాకు వెళ్తున్నాను... ఆగస్ట్ 11న తిరిగి వస్తాను... ఈలోగా అనుమతిలేని నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం నల్గొండ కౌన్సిల్ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక బీఆర్ఎస్ ఆఫీస్‌ను కూల్చివేయాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సయ్యద్ ముసాబ్ అహ్మద్‌ను పిలిచి బీఆర్‌ఎస్‌ ఆఫీసు కూల్చివేత ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. అమెరికా వెళ్లి తిరిగి 11న వస్తానని... ఆ లోపు ఈ తంతు పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారని, కాబట్టి తొలగించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని... ఆరోగ్యం సహకరించకపోవచ్చునని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో డీ-37 కెనాల్‌కు శనివారం నీటిని విడుదల చేశారు. అనంతరం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్‌ వ్యవసాయ క్షేత్రంలో విరామం తీసుకుని భోజనం చేశారు. ఆ తర్వాత ముఖ్య అనుచరులు, సన్నిహితులతో ముచ్చటించారు. శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడం తన చిరకాల ఆకాంక్ష అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :