Saturday, 14 December 2024 03:24:35 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Dharmapur Arvind: రేవంత్! నీ పౌరుషం చచ్చిపోయిందా?: బీజేపీ ఎంపీ అర్వింద్

Date : 03 August 2024 11:31 AM Views : 44

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని వెలికితీస్తామన్న రేవంత్‌రెడ్డి 9 నెలలు అయినా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ‘రేవంత్ .. ఏమైంది నీ పౌరుషం.. చచ్చిపోయిందా?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో నిన్న మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయనంతకాలం ఆమెను అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, అరెస్ట్ చేశాక మాట మార్చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు అసెంబ్లీ సమావేశాలను ఏదో మొక్కుబడిగా నిర్వహించారని విమర్శించారు. ఇప్పుడు సజావుగా జరగడం సంతోషమని వ్యాఖ్యానించారు. సభలో ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి కేటీఆర్‌ను మార్షల్స్ ఎత్తుకుపోవడంపైనా అర్వింద్ స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి (బీఆర్ఎస్) ప్రజలు కనబడలేదని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని పేర్కొన్నారు. తాను ఒక క్రికెటర్‌ని అని, ఒక బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరితే ఎలా ఉంటుందో, అదే స్పీడ్‌తో కేటీఆర్‌ను మార్షల్స్ బయటకు విసిరేశారని పేర్కొన్నారు. ఇక, తమ పార్టీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే నేతకే అధ్యక్ష పదవి దక్కుతుందని అర్వింద్ తేల్చి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :