Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్ ఉన్నంత కాలం టీచర్ల సమస్యలు తీరవని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ తపస్ సంఘం నిర్వహించిన ‘గురు వందనం’లో పాల్గొని పలువురు ఉత్తమ టీచర్లను బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్లపైకి వచ్చి కొట్లాడాలని, విద్యార్థుల సమస్యలపై గళం విప్పాలని చెప్పారు. టీచర్లు తలుచుకుంటే ప్రభుత్వ తలరాత మారుతుందని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్లకు తాను సంపూర్ణంగా మద్దతిస్తానని తెలిపారు. కాంగ్రెస్ కు ఓట్లేస్తే టీచర్లకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. టీచర్ల కోసం తాము పోరాడి జైలుకు వెళ్లామని, కాంగ్రెస్ ను గెలిపించడం ఎంతవరకు సమంజసమని అడిగారు. ఉద్యోగులకు మొదటి నెల జీతం బీజేపీ పోరాట ఫలితమేనని అన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ సంఘాలెందుకు నోరు విప్పలేదని అడిగారు. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం తపస్ మాత్రమేనని అన్నారు. బీఈడీ అర్హతలున్న ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్లలో న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.
Admin
Studio18 News