Studio18 News - తెలంగాణ / : Ganesh Nimajjanam 2024: జంట నగరాల్లో వినాయక చవితి నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలన్ని నిమజ్జనంకు తరలుతున్నాయి. ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ వద్దకు నిమజ్జనానికి భారీగా గణనాథులు తరలివచ్చాయి. భక్తులు శోభాయాత్రలో క్యూ కట్టారు. ఉదయం నుంచి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. గణేశ్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నిమజ్జనానికి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ కు పెద్దెత్తున మండపంలోని గణనాథులు బయలుదేరాయి. దీంతో సోమవారం ఉదయం 5గంటల వరకు కూడా గణేశ్ నిమజ్జన వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. హుస్సేన్ సాగర్, కవదిగూడ, బైబిల్ హౌస్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, లక్డీకాపూల్, లిబర్టీ, నాంపల్లి, మొజంజాహి మార్కెట్, జామ్ బాగ్, బేగం బజార్, అయోధ్య జంక్షన్, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల్లో తీవ్ర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో గంటల తరబడి దారి పొడవునా వాహనా0లు000 నిలిచిపోయాయి. హుస్సేన్ సాగర్ కు నిమజ్జనానికి తీసుకొచ్చే గణనాథులతో నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి అసెంబ్లీ, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతోవాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. హాలిడే కావడంతో గణేశ్ నిమజ్జనాలను తిలకించేందుకు నగరవాసులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 6గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ అర్ధరాత్రి కలశపూజ అనంతరం ట్రాలీపైకి గణనాథుడును తీసుకెళ్తారు. రేపు ఉదయం 6గంటల నుంచి ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ప్లై ఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గలో శోభయాత్ర కొనసాగనుంది. ఎన్డీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చేయనున్నారు.
Admin
Studio18 News