Saturday, 17 January 2026 10:16:44 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

KTR: ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదు: కేటీఆర్

Date : 15 August 2024 04:38 PM Views : 407

Studio18 News - TELANGANA / : ఊసరవెల్లుల రాజ్యం చేస్తే తొండలు, ఉడుతలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని చెప్పారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైనా హైకోర్టు తీర్పు రావచ్చని చెప్పారు. త్వరలోనే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికలో రాజయ్య ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాల్సిందేనని అన్నారు. స్వీకర్ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజయ్య మాట్లాడుతూ... పార్టీని మోసం చేసి కడియం శ్రీహరి వెళ్లిపోయారని మండిపడ్డారు. శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని... ఎన్నో అవకాశాలు ఇచ్చిన పార్టీని మోసం చేశారని విమర్శించారు. రానున్న రోజుల్లో శ్రీహరికి ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. బీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :