Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు.
Admin
Studio18 News