Saturday, 14 December 2024 04:42:33 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Padi Kaushik Reddy: ఒక బ్రోకర్ వచ్చి సవాల్ విసిరితే.. నేనేమైనా చేతకానివాడినా?: కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్రవ్యాఖ్యలు

Date : 12 September 2024 03:30 PM Views : 40

Studio18 News - తెలంగాణ / : "ఒక బ్రోకర్ నా కొడుకు వచ్చి సీనియర్ శాసన సభ్యుడి ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని చెప్పడంలో అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఎన్ని రోజులు అయింది? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బ్రోకరిజం చేసిన వ్యక్తి నాపై సవాల్ విసిరితే... ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నేను చేతకానివాడినా?" అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అరికెపూడి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాల్‌పై అరికెపూడి తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి కనుక 10 గంటలకు తన ఇంటికి రాకపోతే తానే 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్తానన్నారు. తాను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాననే విషయం అందరికీ తెలుసు అన్నారు. కౌశిక్ రెడ్డికి, తనకు మధ్య మాటల యుద్ధం సాగుతోందన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారా? అని మీడియా ప్రశ్నించగా, అరికెపూడి గాంధీ స్పందిస్తూ... 65 మంది కాంగ్రెస్, 38 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 గురు మజ్లిస్, 1 కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నారని సభాపతి చాలా స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని కలవడం సహజమే అన్నారు. తనకు కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేసీఆర్ తనకు ప్రాధాన్యతను ఇచ్చారని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామన్నారు. కానీ పార్టీలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారని మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు గమనించాలని కోరారు. అనర్హత వేటు అంశంపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. న్యాయస్థానాలను గౌరవిస్తామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :