Studio18 News - తెలంగాణ / : KA Paul: తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయ్యిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్థానాలు సాదించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తున్నామని, రాష్ట్ర ప్రజలు తమ పార్టీలోకి వచ్చి, అవినీతి లేని రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. భవనాలను కూలగొట్టడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోతున్నారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారంతా అమ్ముడుపోయినవారేనని కేఏ పాల్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద న్యాయ పోరాటం చేస్తామని, దోచుకోవడంలో, దాచుకోవడంలో కొంత మంది నేతలు బిజీగా ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మీద గౌరవంతో వరంగల్లో బాబూమోహన్‌కి టికెట్ ఇవ్వలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయి బాబూమోహన్‌ను దూరం చేసుకున్నానని చెప్పారు. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డిని ఏ ఒక్కరూ గుర్తుపట్టలేదని, ప్రజా సంపదతో టూరిస్ట్ లా రేవంత్ అమెరికా, కొరియా తిరిగారని అన్నారు. శ్రీకాంత్ చారీ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ఒరిగేదేముందని నిలదీశారు.
Admin
Studio18 News