Monday, 09 September 2024 03:42:42 AM
# HYDRAA: వేటిని కూల్చివేస్తున్నామంటే... స్పష్టత ఇచ్చిన 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ # Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు # Kishan Reddy: రాజకీయాలకు అతీతంగా వీరిని ఆదుకుందాం: కిషన్ రెడ్డి # Apple Glowtime Launch Event : ఆపిల్ గ్లోటైమ్ లాంచ్ ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ నుంచి మొత్తం 4 మోడల్స్.. ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే? # Heavy Rains: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు # Vangalapudi Anitha: జగన్ సొంత డబ్బుతో ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు: హోంమంత్రి అనిత # Flood Damage: తెలంగాణలో వరద నష్టం ఎంతంటే...! # Vijay: తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు # రోడ్లపైకి వచ్చి కొట్లాడాలి.. విద్యార్థుల సమస్యలపై గళం విప్పాలి: బండి సంజయ్ # ACA President : ఏసీఏ అధ్య‌క్షుడిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏకగ్రీవ ఎన్నిక.. తొలి నిర్ణయంగా అదే.. # వరద సహాయంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం # రుణ‌మాఫీ ల‌బ్దిదారుల‌ను ఆంక్ష‌ల పేరుతో వేధిస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్ # Deepika Padukone : పండంటి పాపాయికి జన్మనిచ్చిన దీపికా పదుకోన్.. # రష్యా – ఉక్రెయిన్ వార్‌కు చెక్ పెట్టేలా మోదీ అడుగులు.. రంగంలోకి అజిత్ డోభాల్ # Prabhas New Look : ప్రభాస్ కొత్త లుక్ చూశారా? సన్నబడ్డ రెబల్ స్టార్..? # Boats: ఆ మూడు బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ కు చెందినవి: టీడీపీ # Nara Lokesh: ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ ప్రభుత్వంపై విమర్శలా? మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ మంత్రి లోకేశ్ # Raja Singh: హైడ్రా కూల్చివేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # HYDRA: సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆక్రోశం.. వైరల్ వీడియో # HYDRA: హైడ్రా రానక్కర్లేదు.. ఆ షెడ్‌ను మేమే తొలగిస్తాం: మురళీ మోహన్

KCR: ప్రభుత్వానికి సమయమివ్వాలని భావించాం... నేను సభకు కూడా రాలేదు: బడ్జెట్‌పై కేసీఆర్

Date : 25 July 2024 03:48 PM Views : 32

Studio18 News - తెలంగాణ / : ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... గ‌త ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టిందన్నారు. యాద‌వ సోద‌రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్ర‌వేశ‌పెట్టిన గొర్రెల పంపకం ప‌థ‌కాన్ని మూసివేసిన‌ట్టు అర్థమవుతోందన్నారు. అట్ట‌డుగు వ‌ర్గాల గొంతు కోసిందని ధ్వజమెత్తారు. ద‌ళితబంధు ప్ర‌స్తావ‌న లేదని... మ‌త్స్య‌కారుల‌కు భ‌రోసా లేదన్నారు. అంకెలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆర్థికమంత్రి ఒత్తిఒత్తి ప‌లక‌డం త‌ప్ప కొత్త‌గా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారని... కానీ ఇది పాత పథకమే అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేం కూడా కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని భావించామని, తాను కూడా శాసన సభకు రాలేదని, కానీ ఈ రోజు బడ్జెట్‌ను చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదని ఆరోపించారు. వ్య‌వ‌సాయం విష‌యంలో తమకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండేదన్నారు. కానీ ఇది రైతు శత్రు ప్రభుత్వమన్నారు. ధాన్యం కొనుగోలు చేయ‌లేదని... విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదని... నీళ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదని ఆరోపించారు. ఇంకా రైతుబంధు, రైతు భ‌రోసా ప్ర‌స్తావ‌నే లేదన్నారు. రైతు భ‌రోసా ఎప్పుడు వేస్తార‌ని తమ ఎమ్మెల్యేలు అరిస్తే క‌నీసం స‌మాధానం చెప్ప‌డం లేదన్నారు. రైతుల‌ను, వృత్తి కార్మికుల‌ను ఈ ప్రభుత్వం వంచించిందన్నారు. బడ్జెట్ ప్రసంగంలా కనిపించలేదని... రాజకీయ సభలలో చెప్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ... ఇలా ఏ అంశంపై స్పష్టత లేదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :