Sunday, 08 February 2026 01:54:30 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

HYDRA: సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆక్రోశం.. వైరల్ వీడియో

Date : 08 September 2024 02:19 PM Views : 510

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ లోని మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. బహుళ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు కూల్చివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అక్కడున్న బాధితులు మీడియా ముందు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. కూల్చివేతలు జరుగుతున్న చోట ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడున్న వారిని పోలీసులు దూరంగా పంపించారు. ఓ మహిళ కన్నీళ్ల మధ్య హైడ్రా అధికారులను, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వంపై, సీఎంపై శాపనార్థాలు పెట్టింది. తమ కట్టడాలు అక్రమమంటూ నోటీసులు ఇవ్వడంతో తాము కోర్టుకు వెళ్లామని మీడియా ముందు వెల్లడించింది. అయినా ఆగకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేస్తే కోర్టులు ఉన్నది ఎందుకు..? మేం కోర్టుకు వెళ్లడం ఎందుకు? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగుడుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడింది. ఆ మహానుభావుడు (కేసీఆర్ ను ఉద్దేశించి) 28 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని గుర్తుచేసింది. ‘ఏం బాబూ నువ్వు ఎందుకు వచ్చావు. మా కడుపులు కొట్టడానికి వచ్చావా? కేసీఆర్ తెలంగాణను తెచ్చాడు. నువ్వేం తెచ్చావు? మా కడుపు కొట్టి ఇళ్లను కూల్చడానికి వచ్చావు. ఏదైనా మంచిపని చేసి శభాష్ అనిపించుకో’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సదరు మహిళ విమర్శించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :