Studio18 News - TELANGANA / : హైదరాబాదులో ఓ మహిళ మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో రచ్చ చేసింది. అవును... నేను తాగాను... బరాబర్ క్వార్టర్ తాగాను... ఏం చేస్తారు? అంటూ సవాల్ విసిరింది. సదరు మహిళ ఉప్పల్ రామంతపూర్ లోని వివేక్ నగర్ నివాసిగా గుర్తించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. మద్యం మత్తులో ఇతరులను దూషించడం, తిరిగి వారిపైనే ఫిర్యాదు చేయడం ఆమెకు అలవాటేనని పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు మద్యం మత్తులో వచ్చిన ఆ మహిళ... పీఎస్ లో హంగామా సృష్టించింది. బ్రీత్ ఎనలైజర్ లో ఊదమని చెబితే.... ఆమె ఇష్టం వచ్చినట్టు ఊదడంతో... ఇలా కాదమ్మా... మేం చెప్పేంత వరకు ఊదుతూనే ఉండాలి అని పోలీసులు చెప్పారు. దాంతో తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ... నేను బరాబర్ క్వార్టర్ తాగానని చెబుతుంటే, ఇంకా ఎందుకు ఊదాలి? అంటూ పోలీసులను తిరిగి ప్రశ్నించింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా బాగా విసిగించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Also Read : రేవంత్ రెడ్డి రెండు తలల పాము కంటే డేంజర్: హరీశ్ రావు
Admin
Studio18 News