Sunday, 29 March 2026 05:21:37 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Eesha Rebba: అసభ్యకర కామెంట్లు.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి ఈషా రెబ్బ

Date : 04 February 2026 07:03 PM Views : 48

Studio18 News - TELANGANA / HYDERABAD : ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టు కింద అసభ్యకర కామెంట్లు పెట్టారని ఫిర్యాదు కామెంట్లు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్న ఈషా రెబ్బ ఫేక్ అకౌంట్ ద్వారా పెడుతున్నారని వివరాలు ఇచ్చిన నటి ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను పెట్టిన పోస్టు కింద అసభ్యకర కామెంట్లు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని చెబుతూ ఆ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను అందించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈషా రెబ్బ వరంగల్‌కు చెందిన తెలుగు నటి. 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఇటీవల 'ఓం శాంతి శాంతి' చిత్రంలో నటించారు. ఇటీవలి కాలంలో సినిమా తారలపై సోషల్ మీడియాలో కొంతమంది అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టడం బాగా పెరిగింది. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోల ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా కంటెంట్‌ను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటికి సంబంధించి వారు కోర్టులను కూడా ఆశ్రయించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :