Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : Rajanna Sircilla districtలో ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ Garima Agrawal తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిర్ణీత పరీక్ష సమయం తర్వాత ఐదు నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను అనుమతిస్తారు. జిల్లాలో మొత్తం 7,317 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, బాలురు 3,511 మంది, బాలికలు 3,806 మంది ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో డెస్కులు, తాగునీరు, టాయిలెట్లు, ట్యూబ్‌లైట్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కుసుమ రామయ్య జడ్పీ హైస్కూల్ (బాయ్స్) సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ వెంకంపేట సిరిసిల్ల, సిద్దార్థ ఇంగ్లిష్ మీడియం పత్తిపాక వీధి సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (బాలికల) ఏ వింగ్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (బాలికల) బీ వింగ్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ నెహ్రునగర్, ప్రభుత్వ హైస్కూల్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (వొకేషనల్) తంగళ్ళపల్లి, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ చందుర్తి, జడ్పీ హైస్కూల్ రుద్రంగి, జడ్పీ హైస్కూల్ (వొకేషనల్) ఇల్లంతకుంట, కేరళ మోడల్ స్కూల్ ఇల్లంతకుంట, జడ్పీ హైస్కూల్ గాలిపెల్లి, జడ్పీ హైస్కూల్ జిల్లెల, జడ్పీ హైస్కూల్ లింగన్నపేట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేములవాడ, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేములవాడ, గౌతం హైస్కూల్ వేములవాడ, జడ్పీ హైస్కూల్ (బాలికల) వేములవాడ, కిడ్స్ కాన్వెంట్ హైస్కూల్ వేములవాడ, హంసిని డిజి హైస్కూల్ వేములవాడ, జడ్పీ హైస్కూల్ (బాయ్స్) గంభీరావుపేట్ (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ (బాలికల) గంభీరావుపేట్, జడ్పీ హైస్కూల్ (బాయ్స్) ముస్తాబాద్, జడ్పీ హైస్కూల్ (బాలికల) ముస్తాబాద్ (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ ఎల్లారెడ్డిపేట ఏ వింగ్, జడ్పీ హైస్కూల్ ఎల్లారెడ్డిపేట బీ వింగ్, జడ్పీ హైస్కూల్ వీర్నపల్లి (వొకేషనల్), టీఎస్ మోడల్ స్కూల్ కోనరావుపేట, సిరిసిల్ల (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ ధర్మారం, జడ్పీ హైస్కూల్ బోయినపల్లి (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ విలాసాగర్‌లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు Section 144 అమలు చేయనున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 34 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 34 సిట్టింగ్ స్క్వాడ్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు, స్టేట్ లెవల్ అబ్జర్వర్లు, కస్టోడియన్ అధికారులను నియమించారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల మధ్య విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, విద్యార్థులు పరీక్షా సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ????✍️
Admin
Studio18 News