Studio18 News - TELANGANA / : నిన్నమొన్నటి వరకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో కనిపించిన బైక్ రొమాన్స్ ఇప్పుడు హైదరాబాద్‌కూ పాకింది. శ్రీశైలం రహదారిపై ప్రేమ జంటలు చెలరేగిపోతున్నాయి. నిన్న ఓ ప్రేమజంట పట్టపగలు బైక్‌పై రొమాన్స్ చేస్తూ చెలరేగిపోయింది. పెట్రోల్ ట్యాంకుపై ప్రియుడికి అభిముఖంగా కూర్చున్న యువతి అతడికి ముద్దులు పెడుతూ రొమాన్స్ చేసింది. అది బహిరంగ ప్రదేశమని, తమచుట్టూ జనం ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా పోయింది. పహాడీషరీఫ్ వద్ద జరిగిన ఈ ఘటనను మరో జంట వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇదికాస్తా వైరల్ అయింది. దీనిపై కొందరు ఎక్స్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Admin
Studio18 News