Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాసర విజ్ఞాన విహార యాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ నాయకుడు ఉమ్మాజి నరేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాయాలని తెలిపారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News