Studio18 News - TELANGANA / SANGAREDDY : పటాన్చెరు నియోజకవర్గం భారతినగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీ మసీదులో ఈరోజు రంజాన్ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి మసీదు సదర్ సమద్, ఖలీల్ హాజరై ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని అవసరమైన కుటుంబాలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సోదరభావం, దానం, సహకారం అనే విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పేదలకు సహాయం చేయడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, మైనారిటీ నాయకులు ఘౌస్, అజీముద్దీన్, కుతుబుద్దీన్, జాకీర్, షకీల్, జావిద్, బాబా, శ్యామ్, జైపాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు.
Admin
Studio18 News