Saturday, 24 January 2026 08:40:53 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హాజ‌రైన ప్రభాకర్ రావు

Date : 09 June 2025 04:06 PM Views : 513

Studio18 News - TELANGANA / : తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. నిన్న‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆయ‌న ఈరోజు సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నెలల తరబడి అమెరికాలో ఉన్న ఆయన నిన్న నగరానికి చేరుకున్నారు. ఆదివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రభాకర్ రావు, భారత్‌కు వచ్చిన మూడు రోజుల్లోగా అధికారుల ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన సిట్ విచారణకు మార్గం సుగమమైంది. ఇక‌, ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయ‌న నుంచి కీల‌క సమాచారం రాబ‌ట్టాల‌ని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్ప‌టికే రాధ‌కిష‌న్ రావు, ప్ర‌ణీత్‌రావు, తిరుప‌త‌న్న‌, భుజంగ‌రావుల‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. వీరు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ప్ర‌భాక‌ర్‌రావును ప్ర‌శ్నించ‌నున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటి నుంచి ఆయన అమెరికాలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో భారత అధికారులు ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. ఏడాదికి పైగా విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నందున, నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇటీవలే ఆయన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయాణ పత్రం కోసం భారత రాయబార కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది గతంలో కోర్టుకు తెలియజేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :