Studio18 News - తెలంగాణ / : తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోన్న వేళ హైదరాబాద్‌లోనూ కల్తీ నెయ్యి తయారీ గుట్టురట్టయింది. కల్తీ నెయ్యి తయారీ కేంద్రం పై ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో, నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఎస్వోటీ పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అక్కడి పరికరాలను పరిశీలిస్తున్నారు. గౌడన్ల వద్ద డబ్బాలకు డబ్బాల కొద్దీ నెయ్యి ఉంది. అక్కడి పరిసరాలు అన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. తిరుమల విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీని కుదిపేస్తున్న నేపథ్యంలో ఎస్వోటీ పోలీసులు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పక్కా సమాచారం అందుకుని కల్తీ రాయుళ్ల పని పడుతున్నారు అధికారులు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారి చర్యలను ఉపేక్షించేదిలేదని హెచ్చరిస్తున్నారు.
Admin
Studio18 News