Friday, 14 February 2025 07:04:27 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్

Date : 26 January 2025 12:41 AM Views : 49

Studio18 News - TELANGANA / JOGULAMBA GADWAL : దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉన్నందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాంప్లెక్స్ నుండి కృష్ణవేణి చౌక్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు,విద్యార్థులు పాల్గొని ప్లే కార్డులు చేతబట్టి మన ఓటు – మన హక్కు, ఓటు ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు చేయించి, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. మీ అభిప్రాయం ప్రభుత్వానికి చేరాలంటే, పాలసీ మేకింగ్‌లో మీ వంతు పాత్ర ఉండాలంటే , ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు.నేటి విద్యార్థులే రేపటి పౌరులు, అందుకే వారిలో ఓటు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడి బాధ్యతలో ప్రధానమైనది ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కును వినియోగించుకోవడమని తెలిపారు.ఓటు వేయడం ద్వారానే మీ వాయిస్ ను ప్రభుత్వానికి చేరవచ్చు,” అని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 17 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు అయ్యే అవకాశం కల్పించిందని అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుకోవాలని, ఆన్‌లైన్‌లో కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వచ్చి ఈ ప్రక్రియను సులభతరం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ప్రదేశంలో ఓటింగ్ అందుబాటులో ఓటు హక్కును అందరికీ చేరువ చేయడానికి ప్రభుత్వం దూర ప్రాంతాలు, దీవులు, లేదా అందుబాటులోకి రాని వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని గుర్తు చేశారు. జిల్లాలో గుర్రం గడ్డ గ్రామం వంటి దివి ప్రాంతాల్లోకి బోట్ లైన్ల ద్వారా ఓటర్లను చేరుకోవడం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇంత కృషి చేస్తున్నా, పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు,పల్లెల్లో ఓటింగ్ శాతం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయంలో కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా పేర్కొంటూ, అందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని అవగాహన పెంపొందించి, తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.ఆ తర్వాత, ర్యాలీలో పాల్గొన్న అందరూ ఓటర్ ప్రమాణం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :