Thursday, 12 March 2026 01:23:31 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..!

Date : 07 February 2026 07:00 PM Views : 108

Studio18 News - TELANGANA / HYDERABAD : షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న డీసీపీ శిల్పవల్లి ఏయే ఫైళ్లు కాలిపోయాయనే దానిపై స్పష్టత రావాలన్న డీసీపీ మంటలను తొలుత ఆఫీస్ బోయ్ గమనించాడని వెల్లడి హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ... ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందిందని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. భవనం తొలి అంతస్తులో కంప్యూటర్లు ఉంటాయని డీసీపీ తెలిపారు. మంటల్లో ఏయే ఫైళ్లు కాలిపోయాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. మంటలను ఆఫీస్ బోయ్ తొలుత గమనించాడని... వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో అతడు అస్వస్థతకు గురయ్యాడని... వెంటనే 108లో ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని... మంటలను గమనించిన వెంటనే వారు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. డీఎఫ్ఓ శ్రీదాస్ మాట్లాడుతూ... మొదటి అంతస్తులో పలు కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించిందని చెప్పారు. విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నామని... అప్పటికే మంటలు వ్యాపించాయని తెలిపారు. రెండో అంతస్తులో కెమికల్ ల్యాబ్ ఉందని... అయితే, మంటలు రెండో అంతస్తుకు వ్యాపించలేదని చెప్పారు. తొలి అంతస్తులో ఉన్న సున్నితమైన ప్లాస్టిక్ వస్తువులు ఆహుతయ్యాయని తెలిపారు. హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా? లేదా పాక్షికంగా కాలాయా? అనేది పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :