Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న అర్ధరాత్రి సమయంలో దొంగలు గ్రామంలోకి ప్రవేశించి సుమారు 8 ఇళ్లలో, 2 కిరాణా దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం, నగదు దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో మండల వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
Studio18 News