Monday, 28 April 2025 06:17:50 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

అటు కేంద్రం, ఇటు రాష్ట్రం బంపర్ ఆఫర్లు..! బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య దారెటు?

Date : 26 September 2024 10:51 AM Views : 66

Studio18 News - TELANGANA / : Gossip Garage : వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య ఇప్పుడు పొలిటికల్‌ చౌరస్తాలో నిల్చొన్నారు. దశాబ్దాలుగా బీసీల కోసం ఉద్యమించిన తాను.. మళ్లీ బీసీల హక్కుల కోసం పోరాడతానని ప్రకటించారు. కానీ, ఆయన ప్రకటనలపై ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు.. బీసీ పోరాటల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యను తెలంగాణ రాజకీయాల్లో వాడుకోవాలని రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయట… కేంద్రంలో పదవి ఇస్తామని ఓ పార్టీ.. రాష్ట్రంలో చూసుకుంటామని మరో పార్టీ ఆయన వెంట పడుతున్నాయని చెబుతున్నారు.. ఇంతకీ బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య ఆలోచనలేంటి? ఆయన పొలిటికల్‌ ప్లానింగ్‌ ఎలా ఉండబోతోంది….? కృష్ణయ్య కోసం ఆ రెండు ప్రధాన పార్టీల ప్రయత్నాలు.. బీసీ ఉద్యమనేత ఆర్‌.కృష్ణయ్య పొలిటికల్‌ ఫ్యూచర్‌పై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. బీసీ ఉద్యమం అంటేనే గుర్తుకొచ్చే ఆర్‌.కృష్ణయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తెలంగాణల్లో ప్రభావవంతమైన బీసీ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆర్‌.కృష్ణయ్య కోసం ఎప్పుడూ డోర్స్‌ ఓపెన్‌ చేసి ఉంచుతున్నాయి. ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌.. ఆర్‌.కృష్ణయ్యను తమ పార్టీలో చేరమంటే తమ పార్టీలో చేరమని ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. నిన్నటివరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్‌.కృష్ణయ్య అకస్మాత్తుగా తన ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. బీసీ ఉద్యమ నేతగా తెలంగాణలో ఆయనకు గణనీయమైన అనుచరగణం ఉండటంతో ప్రధాన పార్టీలు రెండూ కృష్ణయ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కృష్ణయ్య కోసం బీజేపీ స్కెచ్.. 90వ దశకం నుంచి బీసీ ఉద్యమ నేతగా తెలంగాణలో తన ముద్ర వేసిన కృష్ణయ్య… 2014లో తొలిసారిగా ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ-టీడీపీ పొత్తుతో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌.కృష్ణయ్య ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత టీడీపీ శాసనసభ్యుల్లో ఎక్కువ మంది అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరినా, కృష్ణయ్య మాత్రం సింగిల్‌గానే ఉండిపోయారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిన కృష్ణయ్య, రెండేళ్ల క్రితం ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు. పార్టీలోకి వస్తే.. జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ చేస్తామని హామీ.. ఐతే తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ.. ఎప్పటి నుంచో ఆర్‌.కృష్ణయ్యపై గురిపెట్టినట్లు చెబుతున్నారు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కృష్ణయ్యతోనూ రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని కమలనాథులు స్కెచ్‌ వేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తమ పార్టీలోకి వస్తే జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం.. పదవులు ఇస్తామని హామీ..! ఇక ఉరుము లేని పిడుగులా… అకస్మాత్తుగా రాజ్యసభకు రాజీనామా చేసిన కృష్ణయ్య మళ్లీ బీసీ ఉద్యమంలో పనిచేస్తానని ప్రకటించినా, ఆయనతో కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం, సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, బీసీ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌ వంటి వారు కృష్ణయ్యను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు చేయడం ఆసక్తి పెంచేస్తోంది. తాను బీసీ ఉద్యమానికే పరిమితమవుతానని కృష్ణయ్య చెబుతున్నా… రెండు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు ఉండటంతో ఎటూ తేల్చుకోలేక ఆయన అలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ఒక వైపు కేంద్రం, రెండో వైపు రాష్ట్రం నుంచి పదవులు ఇస్తామని చెబుతుండటంతో ఏ పదవి అయితే బాగుంటుందని ఆయన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా చేరే పార్టీని ఎంచుకోవడం మరో ఎత్తు..! రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలో మూడు పార్టీలు మారిన ఆర్‌.కృష్ణయ్య ఈ సారి ఏ పార్టీలోకి వెళతారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బలపడాలని భావిస్తున్న కమలనాథులు… జాతీయ స్థాయిలో ఎలివేషన్‌ ఇస్తామని చెబుతుండటంతో ఆయన అడుగులు అటువైపు వేస్తారా? లేక లోకల్‌ ఫీలింగ్‌తో కాంగ్రెస్‌ను ఎంచుకుంటారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి పొలిటికల్‌ చౌరస్తాలో నిలబడిన బీసీ ఉద్యమనేత ఎంపీ పదవిని వదులుకోవడం ఒక ఎత్తైతే… ఇప్పుడు కొత్తగా చేరే పార్టీని ఎంచుకోవడం మరో ఎత్తుగా చెబుతున్నారు. ఏదిఏమైనా కొద్దిరోజుల్లోనే ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :