Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాల్గాట్ గ్రామంలో శనివారం గ్రామ ప్రజాప్రతినిధులు పల్లె దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల, హైస్కూల్‌లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతను తనిఖీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాలల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత సిబ్బందితో మాట్లాడి సేవలను మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్, ఉపసర్పంచ్ తలకట్ల రాములు, వార్డు సభ్యులు పోతుగంటి రాజేందర్, తలకట్ల నవ్య, చిట్టిబాబు, గొల్లపురం రుక్మిణి భాయ్, ఉప్పరి గోపి, జాగిరపు స్రవంతి, నాయుడు నవీన్, గ్రామ కార్యదర్శి మలవత్ రాజు, కారోబార్ బొబ్బిలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News