Friday, 14 February 2025 07:23:13 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు

Date : 26 January 2025 12:57 AM Views : 59

Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ మేయర్ సునీల్​రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్​ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ మేరకు సునీల్​రావుకు కేంద్రమంత్రి బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కరీంనగర్ స్మార్ట్‌ సిటీ నిధుల విషయంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అండగా ఉన్నందువల్ల అభివృద్ది కొనసాగాలని బీజేపీలో చేరుతున్నట్లు మేయర్‌ సునీల్‌రావు స్పష్టం చేశారు. అవినీతి అక్రమాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం తనకు లేదని ఎక్కడ కూడా అవినీతి అవకతవకలు జరగలేదని ఘంటాపదంగా చెప్పగలనని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్​రావు ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంగులకు కమీషన్లు ముడితే చాలని పనుల గురించి పట్టించుకోరని విమర్శించారు. కరీంనగర్​లో జరిగిన ప్రతి కుంభకోణంలో గంగుల పాత్ర ఉందని సునీల్ మండిపడ్డారు. బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని వివరించారు. కరీంనగర్ అభివృద్ధిని గంగుల ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరాభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంతకాలం మౌనంగా ఉన్నానని స్పష్టం చేశారు. రోడ్లు, చెక్​డ్యామ్​ల కాంట్రాక్టర్లు అందరూ బినామీలేనని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్​పై కాషాయ జెండా ఎగురవేస్తామని విమరించారు. త్వరలో మరికొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరతారని సునీల్​రావు అన్నారు. పార్టీలో కొందరు అనుయాయులతో తనపై విమర్శలు చేయిస్తున్నారో తనకు తెలుసని సునీల్​రావు వివరించారు. తనపై విమర్శలు చేయిస్తున్న వారు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారో నా దగ్గర చిట్టా మొత్తం ఉందన్న ఆయన త్రిబుల్ వన్‌ జీఓలో భూములు ఎక్కడెక్కడ కొన్నారో, ఖాజీపూర్‌ ఇసుక క్వారీ అక్రమాలు, మానేరు రివర్‌ ఫ్రంట్‌లో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :