Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా మందమర్రిలోని జయశంకర్ సార్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన చారిత్రక దీక్షను స్మరించుకుంటూ దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 29, 2009న కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మలుపు తిప్పిన సంఘటన అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరుగుతున్న దీక్షా దివస్ కార్యక్రమానికి మందమర్రి నుండి పార్టీ శ్రేణులు భారీగా ర్యాలీగా బయలుదేరి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, TBGKS యూనియన్ ప్రతినిధులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నాయకులు, మహిళా నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.
Admin
Studio18 News