Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్, మలక్ పేట పరిధిలోని ఐ ఎస్ సదన్ డివిజన్ డీఎస్ నగర్ లో పెండింగ్ లో ఉన్న బాక్స్ డ్రైన్ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి కోరారు. జీ హెచ్ ఎం సి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆమె కాలువ పనులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడుతూ సత్వరమే పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కొత్తవాళ్లను నియమించి పెండింగ్ పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయించాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు.
Also Read : #RajannaSircilla : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి
Admin
Studio18 News