Saturday, 14 December 2024 05:59:23 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: 'నీకు బాగా తెలిసిన ఆ ప‌ని చేసుకోవ‌డం మంచిదమ్మా చిట్టి'.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్‌!

Date : 17 September 2024 03:19 PM Views : 59

Studio18 News - తెలంగాణ / : సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంట‌ర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సెటైర్లు వేశారు. "కంప్యూటర్‌ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూట‌ర్‌ పరిచయం చేసిందీ రాజీవ్ కాదు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ కాలిక్యులేటర్ (టీఐఎఫ్ఆర్ఏసీ) వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్ గాంధీకి అప్పటికి 12 ఏళ్లు. ఏదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్‌ వీటికి పరిమితమైతే మంచిదమ్మా చిట్టి" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, సోమ‌వారం రాజీవ్ గాంధీ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. "ఇప్పుడు ట్విట్ట‌ర్ పిట్ట‌ ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూట‌ర్ చ‌దువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూట‌ర్‌ను ఈ దేశానికి తెచ్చిందే రాజీవ్ గాంధీ. ఆయ‌న లేక‌పోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వ‌డ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వే స్టేష‌న్‌లో చాయ్‌, స‌మోసా అమ్ముకునేవాడివి" అని కేటీఆర్‌పై ముఖ్య‌మంత్రి సెటైర్ వేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :