Studio18 News - TELANGANA / : తెలంగాణ అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ తెలిపారు. సభాపతిపై జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క శాసన సభలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని సూచించారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని శ్రీధర్ బాబు ప్రతిపాదించగా, స్పీకర్ ఆమోదించారు.
Admin
Studio18 News