Thursday, 12 March 2026 03:55:44 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

KCR: ఎన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ నిప్పులా బయటకు వస్తారు: పద్మా దేవేందర్ రెడ్డి

Date : 02 September 2025 07:07 PM Views : 352

Studio18 News - TELANGANA / MEDAK : కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న పద్మా దేవేందర్ రెడ్డి ఘోష్ కమిటీ నివేదిక చెత్తబుట్టలోదేనన్న మాటే నిజమైందని వ్యాఖ్య క్రమశిక్షణ ఉల్లంఘన వల్లే కవితపై సస్పెన్షన్ వేటు అన్న పద్మ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేయడంతో న్యాయమే గెలిచిందని ఆమె అన్నారు. మెదక్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఘోష్ కమిటీ నివేదికలో పసలేదని, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఉందని న్యాయస్థానమే తేల్చి చెప్పిందని పద్మా దేవేందర్ రెడ్డి గుర్తుచేశారు. "తెలంగాణ ప్రజల కోసం ఒక యజ్ఞంలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్, భవిష్యత్తులో ఎన్ని కుట్రలు జరిగినా, సీబీఐ విచారణ వేసినా నిప్పులా బయటకు వస్తారు. కాంగ్రెస్ కుట్రలను తప్పకుండా ఛేదిస్తారు" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని, వాటిని కేసీఆర్, హరీశ్ రావు కమిటీ ముందు ఉంచి తమ వాదనలు వినిపించారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై కూడా పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించడం క్రమశిక్షణా రాహిత్యమేనని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందునే, సొంత బిడ్డ అని కూడా చూడకుండా కేసీఆర్ కవితపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. "పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎవరికైనా చర్యలు తప్పవని కేసీఆర్ స్పష్టమైన సందేశం పంపారు. ఈ నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం" అని ఆమె వివరించారు. కేసీఆర్ లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులంతా అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :