Saturday, 14 December 2024 06:42:40 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Konda Surekha: మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు

Date : 14 October 2024 11:34 AM Views : 19

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ మంత్రి కొండా సురేఖను వివాదాలు వదలడం లేదు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదం కావడం, ఆ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ నటుడు నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ వివాదం మరువకముందే మంత్రి సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారంటూ మంత్రి సురేఖ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే .. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఆదివారం వివాదం నెలకొంది. దసరా పండుగను పురస్కరించుకుని ధర్మారంలో కొండా సురేఖ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ అనుచరులు ..రేవూరి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై రేవూరి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గీసుకొండ పోలీసులు కొండా సురేఖ వర్గానికి చెందిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆ ముగ్గురిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయులు ధర్నా చేశారు. చివరకు సమస్యను పరిష్కరిస్తామని సీఐ మహేందర్ హామీ ఇవ్వడంతో కొండా అనుచరులు ధర్నా విరమించారు. మరో పక్క తన వర్గీయులైన ముగ్గురిని గీసుకొండ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆమె నేరుగా గీసుకొండ పోలీసులు స్టేషన్ కు చేరుకున్నారు. తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారంటూ నిలదీశారు. మంత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారని తెలియడంతో పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు అక్కడకు చేరుకున్నారు. విషయం వివాదాస్పదం కావడంతో వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝూ అక్కడకు చేరుకున్నారు. దీనికి బాధ్యులైన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :