Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం నగరంలోని 35వ డివిజన్‌లో కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజన్‌కు చెందిన స్థానిక మహిళలు ఒక ప్రాంగణంలో సమావేశమై ముందుగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి పద్మ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, పురుషులతో సమానంగా పోటీ పడాలని సూచించారు. అలా పోటీ పడడం వల్ల మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లి సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ బజ్జూరి ఇందిరా రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తి జీవితంలో కూడా మహిళలు ముందంజలో నిలవడం సమాజానికి ఆదర్శమని అన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే పురుషుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలు అబలలు కాదని, ఒక శక్తిగా సమాజంలో నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో యల్లంపల్లి పద్మ, బజ్జూరి ఇందిరా రెడ్డి, ఉప్పుగడ్ల ప్రమీల, బుగ్గవీటి కృష్ణవేణి, లీలావాణి, లక్ష్మీ, శ్రీదేవి, లతా, దేవి, కౌసల్య, స్వప్న తదితర మహిళలు పాల్గొన్నారు.
Admin
Studio18 News